YSRCP: కడప దాటి ప్రతి గడపలోకి వస్తున్నాను.. 'యాత్ర' ఫస్ట్ లుక్ విడుదల!

  • వైఎస్ఆర్ బయోపిక్ 'యాత్ర' ఫస్ట్ లుక్ విడుదల
  • వైఎస్ఆర్ పాత్రలో  నటిస్తున్న మమ్ముట్టి
  • ఈ నెల 9 నుండి రెగ్యులర్ షూటింగ్

మహి వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ 'యాత్ర' నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదిలారు. ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్రలో నటిస్తున్న మమ్ముట్టి వైఎస్ లాగా చేయి ఊపుతూ కనిపిస్తున్న పోస్టర్ లో 'కడప దాటి ప్రతి గడపలోకి వస్తున్నాను.. మీతో కలిసి నడవాలనుంది.. మీ గుండె చప్పుడు వినాలనుంది.. ' అనే వ్యాఖ్యలతో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 9 నుండి ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News