ipl: ముంబైపై గెలిచి టోర్నీ ఆరంభించాలనుకుంటున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్

  • మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం
  • వాంఖడే స్టేడియంలో మ్యాచ్ అంటేనే థ్రిల్ 
  • వేలి గాయంతో తొలి మ్యాచ్ కి డుప్లెసిస్ దూరం

నేడు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జరగనున్న మ్యాచ్ కు సర్వసన్నద్ధంగా ఉన్నామని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ తెలిపాడు. మ్యాచ్ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, తొలిపోరు కావడంతో కొంత ఆందోళనగా ఉన్నప్పటికీ స్థిరంగా ఉన్నామని అన్నారు. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ను వాంఖడే స్టేడియంలో ఆడనున్నామని, వాంఖడే స్టేడియంలో మ్యాచ్ అంటే ఒక థ్రిల్‌ ఉంటుందని ఆయన చెప్పారు. తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించి, టోర్నీకి శుభారంభం ఇవ్వాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ మ్యాచ్ కోసం తమ జట్టులోని ఆటగాళ్లంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఆయన చెప్పారు. కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ, డ్వేన్‌ బ్రావో, షేన్‌ వాట్సన్‌, హర్భజన్‌ సింగ్‌ లు జట్టును ముందుకు నడిపిస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వేలి గాయం కారణంగా తొలి మ్యాచ్ లో డుప్లెసిస్ ఆడడం లేదని ఫ్లెమింగ్ తెలిపారు. 

ipl
chennai super kings
stiefen fleming
  • Loading...

More Telugu News