Jagan: దమ్ముంటే ఈ పని చేయండి: వైసీపీకి సవాల్ విసిరిన బీజేపీ ఎంపీ నరసింహరావు

  • ఒక్క లోక్ సభ ఎంపీలతో మాత్రమే ఎందుకు రాజీనామా చేయించారు
  • రాజ్యసభ, అసెంబ్లీలో కూడా రాజీనామాలు చేయించండి
  • వైసీపీది ముమ్మాటికి అవకాశవాదమే

లోక్ సభ ఎంపీలతో రాజీనామాలు చేయించిన వైసీపీపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు విమర్శలు కురిపించారు. కేవలం లోక్ సభ ఎంపీలతో మాత్రమే రాజీనామాలు చేయించడంలో అర్థం లేదని... రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడా రాజీనామా చేయించాలని ఆయన సవాల్ విసిరారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈమేరకు ఛాలెంజ్ విసిరారు. కేవలం రాజకీయాల కోసం రాజీనామాలు చేయవద్దని... చిత్తశుద్ధితో ఏదైనా చేయాలనుకున్నప్పుడు, పూర్థి స్థాయిలో చేయాలని సూచించారు. ఒక సభలో ఒక రకమైన వైఖరి, మరో సభలో మరో రకమైన వైఖరిని అవలంభించడమనేది... ముమ్మాటికీ అవకాశవాదమేనని విమర్శించారు.  

Jagan
YSRCP
mps
resignation
BJP
gvl narasimha rao
  • Loading...

More Telugu News