Mahesh Babu: 'రంగస్థలం'పై మహేష్ బాబు స్పందన

  • చరణ్, సమంతలది కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్
  • మాస్టర్ ఆఫ్ ది ఆర్ట్ సుకుమార్
  • డీఎస్పీ నీవు ఒక రాక్ స్టార్

రామ్ చరణ్, సమంత, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'రంగస్థలం' సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ మరోసారి తన సత్తా చాటిందని ట్వీట్ చేశాడు. రామ్ చరణ్, సమంతలకు ఇది కచ్చితంగా కెరీర్ బెస్ట్ పర్మామెన్స్ అని అన్నాడు. సినిమా అద్భుతంగా ఉందని... మొత్తం టీమ్ కు శుభాకాంక్షలు తెలిపాడు. దర్శకుడు సుకుమార్ ను 'ట్రూలీ ఏ మాస్టర్ ఆఫ్ ది ఆర్ట్' అంటూ కొనియాడాడు. ప్రతి విషయంలోనూ నీవు ఒక 'రాక్ స్టార్' అంటూ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ను ప్రశంసించాడు. రత్నవేలు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందని అన్నాడు.

Mahesh Babu
response
ragasthalam
Ramcharan
samantha
sukumar
devi sri prasad
  • Error fetching data: Network response was not ok

More Telugu News