paritala sunitha: ఆటల పోటీల్లో సత్తా చాటిన మంత్రి పరిటాల సునీత.. రెండు విభాగాల్లో విజేత!

  • అమరావతిలో శాసనసభ్యుల ఆటల పోటీలు
  • షార్ట్ పుట్, టెన్నికాయిట్ లలో విజేతగా నిలిచిన సునీత
  • కోడెల చేతుల మీదుగా బహుమతులు అందుకున్న మంత్రి

ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న శాసనసభ సభ్యుల ఆటల పోటీల్లో మంత్రి పరిటాల సునీత సత్తా చాటారు. మహిళా విభాగంలో సునీత తన ప్రతిభను చాటుకున్నారు. షార్ట్ పుట్, టెన్నికాయిట్ విభాగాల్లో విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ చేతుల మీదుగా ఆమె బహుమతులు అందుకున్నారు. మరోవైపు, రెండు విభాగాల్లో విజేతగా నిలిచిన ఆమెకు సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. ఈ క్రీడాపోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు... సత్తా చాటారు.

paritala sunitha
games
mlas
winner
  • Loading...

More Telugu News