mekapati rajamohan reddy: నిరాహారదీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీ మేకపాటికి తీవ్ర అస్వస్థత!

  • తెల్లవారుజామును అస్వస్థతకు గురైన మేకపాటి
  • తీవ్రమైన కడుపునొప్పితో భాధపడ్డ ఎంపీ
  • దీక్ష విరమించుకోవాలని వైద్యుల సూచన

ఏపీకి ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నిన్న మధ్యాహ్నం ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద వారు నిరాహారదీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి (75) ఈ తెల్లవారుజామున అస్వస్థతకు లోనయ్యారు. తీవ్రమైన కడుపునొప్పితో ఆయన బాధపడ్డారు. ఆయనను పరీక్షించిన వైద్యులు... నిరాహారదీక్షను విరమించాలని సూచించారు. అయినప్పటికీ దీక్షను విరమించేందుకు ఆయన నిరాకరించారు.

మరోవైపు, నిన్న సాయంత్రం ఢిల్లీలో వీచిన పెనుగాలులకు వైసీపీ ఎంపీల దీక్షా శిబిరం కకావికలమైంది. అయినప్పటికీ ఏపీ భవన్ లో ఎంపీలు దీక్షను కొనసాగిస్తున్నారు. ఢిల్లీలోని పలు తెలుగు సంఘాలు ఎంపీలకు మద్దతు తెలిపాయి.

mekapati rajamohan reddy
YSRCP
hunger strike
illness
ap bhavan
special status
  • Error fetching data: Network response was not ok

More Telugu News