commenwelth gamen: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణం

  • తొలి స్వర్ణం అందించిన మీరాబాయి చాను
  • రెండో స్వర్ణం అందించిన సంజిత చాను
  • మూడో స్వర్ణం అందించిన సతీష్ కుమార్ శివలింగం

ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ కు మరో స్వర్ణం వచ్చింది. నేటి ఉదయం జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 77 కేజీల విభాగంలో సతీష్ కుమార్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. వెయిట్ లిఫ్టింగ్ క్రీడలోనే మీరాబాయి చాను తొలి స్వర్ణాన్ని అందించగా, మలి స్వర్ణాన్ని మరో వెయిట్ లిఫ్టర్ సంజిత చాను నిన్న భారత్ కు అందించింది. ఇక మూడో స్వర్ణాన్ని పురుషుల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో సతీష్‌ కుమార్ శివలింగం సొంతం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

commenwelth gamen
cwg-2018
gold medals
  • Loading...

More Telugu News