Nara Lokesh: 'మమ్మల్ని కుక్కలంటారా?' అమిత్ షాపై మండిపడ్డ నారా లోకేశ్
- హక్కుల కోసం ఉద్యమిస్తున్నాం
- పిల్లులు, పాములు, ముంగీసలని అంటారా?
- ఏపీని బీజేపీ నాలుగేళ్లు అంధకారంలో పెట్టింది
- తలపొగరుతో జంతువులతో పోలుస్తోంది
భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. ఐదు కోట్ల మంది ప్రయోజనాల కోసం పోరాడుతోంటే కుక్కలతో పోలుస్తారా? అని ట్వీట్ చేశారు. హక్కుల కోసం ఉద్యమిస్తోంటే పిల్లులు, పాములు, ముంగీసలని అంటున్నారని పేర్కొన్నారు. ఏపీని నాలుగేళ్లు అంధకారంలో పెట్టిన బీజేపీ, ఇప్పుడు తలపొగరుతో మనల్ని జంతువులతో పోలుస్తోందని, ఆ పార్టీకి వినాశకాలం దాపురించిందని, అందుకే విపరీత బుద్ధి ప్రదర్శిస్తోందని లోకేశ్ మండిపడ్డారు. బీజేపీకి గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు.