delhi: ఈ నెల 11న అఖిలపక్షం నిర్వహిస్తాం: చలసాని శ్రీనివాస్

  • హోదా సాధన సమితి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం
  • ఆరోజున జరిగే సమావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటాం
  • వైసీపీ ఆమరణ నిరాహార దీక్షకు పూర్తి మద్దతు తెలుపుతున్నా

ఈ నెల 11న హోదా సాధన సమితి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, ఆరోజున జరిగే సమావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చలసాని శ్రీనివాస్ వెల్లడించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద వైసీపీ ఎంపీల ఆమరణ నిరాహార దీక్షా శిబిరం వద్దకు ఆయన వెళ్లారు. వారికి తన సంఘీభావం తెలియజేస్తున్నట్టు చెప్పారు. అనంతరం, మీడియాతో చలసాని మాట్లాడుతూ, వైసీపీ ఎంపీలు నిజాయతీగా పోరాడుతున్నారని, ఆ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు.

delhi
YSRCP
chalasani
  • Loading...

More Telugu News