bajaj: భారత మార్కెట్ నుంచి పల్సర్ 135 ఎల్ఎస్ ఉపసంహరణ!

  • పల్సర్ 135 ఎల్ఎస్ కు తగ్గిన డిమాండ్
  • పల్సర్ సిరీస్ లో ఈ బైకే అతి చిన్నది
  • విదేశీ మార్కెట్ లో మాత్రమే లభ్యం కానున్న పల్సర్ 135 

భారత మార్కెట్లోకి 4 వాల్వ్ టెక్నాలజీతో వచ్చిన మొదటి బైక్ పల్సర్ ఎల్ఎస్ 135 ఇకపై కనిపించదు. భారత మార్కెట్ నుంచి పల్సర్ 135 ఎల్ఎస్ బైక్ ను బజాజ్ ఆటో సంస్థ ఉపసంహరించుకుంది. ఈ బైక్ కు డిమాండ్ పడిపోవడం వల్లే సదరు సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత డీలర్లు చెబుతున్నారు. పల్సర్ సిరీస్ లో ఈ బైకే అతి చిన్నది.

అయితే, భారత మార్కెట్ నుంచి మాత్రమే ఈ మోడల్ ని ఉపసంహరించుకున్నారు. విదేశీ మార్కెట్ లో మాత్రం ఇది లభ్యమవుతుంది. కాగా, ఈ ఏడాది జనవరిలో నూతన హంగులతో అప్ డేటెడ్ వెర్షన్ లో పల్సర్ బైక్ లను లాంచ్ చేసింది. కానీ, పల్సర్ సిరీస్ లోని 135 ఎల్ ఎస్ ను మాత్రం తప్పించింది. బజాజ్ సంస్థ తన అధికారిక వెబ్ సైట్ నుంచి  పల్సర్ 135 ఎల్ ఎస్ ను తొలగించడం గమనార్హం.

bajaj
pulsar 135
  • Loading...

More Telugu News