Pawan Kalyan: కాళ్లు పట్టుకుంటానన్న పవన్ కల్యాణ్.. ఆ తర్వాత ఏం చేశారు?: కళా వెంకట్రావ్

  • అవిశ్వాసం పెడితే మద్దతు కోసం అందరి కాళ్లు పట్టుకుంటానని చెప్పారు
  • అవిశ్వాసం పెట్టిన తర్వాత ఆయన చేసిందేమిటి?
  • బీజేపీ కుట్రలో భాగంగానే టీడీపీపై రెండు పార్టీల విమర్శలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. కేంద్రంపై అవిశ్వాసం పెడితే అందరి కాళ్లు పట్టుకుని మద్దతు కోరతానని గతంలో పవన్ ప్రకటించారని... తీరా అవిశ్వాసం పెట్టిన తర్వాత ఆయన చేసింది ఏమిటని ప్రశ్నించారు. ఏపీ ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారని అన్నారు.

ఏపీకి బీజేపీ నమ్మక ద్రోహం చేస్తుంటే... ఆ కుట్రలో భాగంగా టీడీపీపై రెండు పార్టీలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. పార్లమెంటు లోపల టీడీపీ ఎంపీలు పోరాడుతుంటే... వైసీపీ ఎంపీలు మాత్రం బయటకు వచ్చి షో చేశారని విమర్శించారు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు అఖిలపక్ష సమావేశం జరుగనుందని... ఈ సమావేశానికి మరోసారి అన్ని పార్టీలను ఆహ్వానిస్తామని చెప్పారు.  

Pawan Kalyan
kala venkatrao
YSRCP
Jana Sena
Telugudesam
no confidence motion
  • Loading...

More Telugu News