sneha: టాలీవుడ్ హీరోల్లో నాకు ఈ ముగ్గురు అంటే ఇష్టం: స్నేహ

  • నాగ్, బన్నీ, చరణ్ అంటే ఇష్టం
  • ప్రతి రోజూ యోగా, వాకింగ్ చేస్తా
  • నాకు నేనే రోల్ మోడల్

తెలుగు హీరోల్లో తనకు నాగార్జున, అల్లు అర్జున్, రామ్ చరణ్ లంటే చాలా ఇష్టమని... వీరి నటన చాలా సరదాగా ఉంటుందని నటి స్నేహ తెలిపింది. ప్రస్తుతం తాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలసి నటిస్తున్నానని చెప్పింది. 'శ్రీరామదాసు' సినిమాలో నాగార్జున నటన చాలా గొప్పగా ఉందని కితాబిచ్చింది. ప్రతి రోజు ఉదయమే నిద్ర లేస్తానని, యోగా, వాకింగ్ వంటివి చేస్తానని... అందుకే తన శరీరం యాక్టివ్ గా ఉంటుందని చెప్పింది. తనకు ప్రత్యేకంగా రోల్ మోడల్స్ అంటూ ఎవరూ లేరని... తనకు తానే రోల్ మోడల్ అని తెలిపింది. హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె విషయాలను వెల్లడించింది. 

sneha
actress
Tollywood
favourite hero
  • Loading...

More Telugu News