Telugudesam mps: వెనక్కి తగ్గని టీడీపీ ఎంపీలు... స్పీకర్ లేకపోవడంతో ఆమె చాంబర్లో బైఠాయింపు.. ఫొటో చూడండి

  • స్పీకర్ కోసం వెళితే కనిపించని సుమిత్రా మహాజన్
  • నిరసనగా ఆమె చాంబర్లోనే బైఠాయింపు
  • ఓ ఎంపీ నేలపై పడుకుని నిరసన 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం బడ్జెట్ రెండో దశ సమావేశాల ప్రారంభం నుంచి టీడీపీ ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిత్యం చేస్తున్న నిరసనలు ఈ రోజు ముగింపునకు చేరాయి. చివరి రోజు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. యథావిధిగా లోక్ సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ వాయిదా వేసి వెళ్లిపోయారు. దాంతో టీడీపీ ఎంపీలు స్పీకర్ చాంబర్ వద్దకు వెళ్లారు. అక్కడ ఆమె లేకపోవడంతో నిరసనకు దిగారు. సుమిత్రా మహాజన్ కార్యాలయంలో బైఠాయించారు.

ఓ ఎంపీ ఏకంగా నేలపై పడుకుని మరీ నిరసన తెలపడం గమనార్హం. అంతకుముందు సభ వాయిదా పడిన తర్వాత వీరు లోక్ సభను వీడకపోవడంతో స్పీకర్ పిలుస్తున్నారంటూ భద్రతాసిబ్బంది వారిని పక్కదారి పట్టించి బయటకు పంపించి తాళాలు వేశారు. లోక్ సభ ఈ రోజు నిరవధిక వాయిదా పడిన విషయం విదితమే.

Telugudesam mps
parliament
protest
  • Loading...

More Telugu News