charan: కాస్కోమంటూ రంగంలోకి దూకే పాత్రలో చరణ్

  • బోయపాటి మూవీలో చరణ్ 
  • తనవాళ్ల జోలికి వస్తే సహించని స్వభావం 
  • ఎంతటివాళ్లనైనా ఎదిరించే తత్వం

'రంగస్థలం' సినిమాలో చిట్టిబాబు పాత్రలో చరణ్ ఎంతటి విభిన్నమైన పాత్రను పోషించాడన్నది తెలిసిందే. ఆ సినిమా తరువాత ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. బోయపాటి మార్క్ తోనే ఈ కథ కొనసాగుతుంది. ఇందులోనూ చరణ్ పాత్ర ఇంతకుముందు చేసిన పాత్రలకి పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు.

 ముగ్గురు అన్నల ముద్దుల తమ్ముడిగా చరణ్ ఈ సినిమాలో కనిపిస్తాడట. తన ఫ్యామిలీ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా ... మొండిగా ఎదురెళ్లిపోయి రఫ్ ఆడించే స్వభావం ఆయనది. అందువలన చాలా విషయాలు ఆయనకి తెలియకుండా అన్నయ్యలు చూసుకుంటూ ఉంటారట. చరణ్ అన్నయ్యలుగా తమిళ సీనియర్ హీరో ప్రశాంత్ .. ఆర్యన్ రాజేష్ .. నవీన్ చంద్ర కనిపించనున్నారు. 'గ్యాంగ్ లీడర్'కి దగ్గరగా చరణ్ పాత్ర వుంటుందనే విషయం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.       

charan
boyapati
  • Loading...

More Telugu News