YSRCP: స్పీకర్ కు రాజీనామాలు సమర్పించి, ఆమరణ దీక్షకు బయల్దేరిన వైసీపీ ఎంపీలు

  • రాజీనామాలను ఉపసంహరించుకోవాలని కోరిన స్పీకర్
  • వెనక్కి తీసుకోలేమన్న వైసీపీ ఎంపీలు
  • పార్లమెంటు నుంచి ఏపీ భవన్ కు పయనం

చెప్పిన విధంగానే వైసీపీ లోక్ సభ సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ను ఆమె ఛాంబర్ లో కలసి తమ రాజీనామాలను సమర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, రాజీనామాలను ఉపసంహరించుకోవాలని, ఎంపీలుగా కొనసాగుతూనే పోరాటం చేయాలని సూచించారు. దీనికి సమాధానంగా వైసీపీ ఎంపీలు మాట్లాడుతూ, తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, రాష్ట్ర హక్కుల కోసం రాజీనామాలు చేస్తున్నామని చెప్పారు. అనంతరం వారు అక్కడ నుంచి ఏపీ భవన్ కు బయల్దేరారు. స్పెషల్ స్టేటస్ కోసం ఆమరణదీక్షను వారు చేపట్టనున్నారు. 

YSRCP
mps
resignations
hunger strike
  • Loading...

More Telugu News