Narendra Modi: మోదీ సీటు ఎదుట బైఠాయించిన టీడీపీ ఎంపీలు

  • సభ వాయిదా పడిన వెంటనే.. లేచి వెళ్లిపోయిన మోదీ
  • ప్రధాని మోదీ సీటు ముందు టీడీపీ ఎంపీల ఆందోళన
  • ఇంకా సభలోనే టీడీపీ ఎంపీలు

లోక్ సభను స్పీకర్ సుమిత్రా మహాజన్ నిరవధికంగా వాయిదా వేశారు. ఇటు అవిశ్వాసంపై కానీ, అటు అన్నాడీఎంకే ఎంపీలు డిమాండ్ చేస్తున్న కావేరి బోర్డుపై కానీ ఎలాంటి ప్రకటన లేకుండానే సభ వాయిదా పడింది. అంతకు ముందు, లోక్ సభలో టీడీపీ ఎంపీలు తమ నిరసనలను ఉద్ధృతం చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు గురించి నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభ వాయిదా పడిన వెంటనే, ప్రధాని మోదీ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు. సభ నుంచి అందరూ వెళ్లిపోయినా టీడీపీ ఎంపీలు మాత్రం మోదీ సీటు ఎదుట బైఠాయించి, ఆందోళన చేపట్టారు. సభలో వారి ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. 

Narendra Modi
Telugudesam
mps
protest
Lok Sabha
  • Loading...

More Telugu News