YSRCP: వైసీపీ ఎంపీలకు అపాయింట్ మెంట్ ఇచ్చిన సుమిత్రా మహాజన్

  • రాజీనామాలు చేయనున్న వైసీపీ ఎంపీలు
  • స్వయంగా స్పీకర్ కు అందించాలని నిర్ణయం
  • మధ్యాహ్నం రావాలని సూచన
  • కబురు పెట్టిన స్పీకర్ సుమిత్రా మహాజన్

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రానివ్వకుండా కేంద్రం చూపిన నిర్లక్ష్యానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు లోక్ సభ సభ్యులూ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. తమ రాజీనామాలను స్వయంగా స్పీకర్ సుమిత్రా మహాజన్ కు అందించాలని భావిస్తున్న ఎంపీలు, స్పీకర్ కార్యాలయాన్ని అపాయింట్ మెంట్ కోరగా, వారిని ఈ మధ్యాహ్నం తనను కలుసుకోవాలని సుమిత్ర కబురంపారు. దీంతో మధ్యాహ్నం ఆమెను కలిసి స్పీకర్ ఫార్మాట్ లో ఉన్న తమ రాజీనామా లేఖలను ఆమెకు స్వయంగా ఇచ్చి, ఆపై ర్యాలీగా ఏపీ భవన్ కు వెళ్లి ఆమరణ దీక్షకు దిగాలని వైసీపీ నేతలు తమ కార్యాచరణగా పెట్టుకున్నారు.

YSRCP
MPS
Resignation
Speaker
Sumitra Mahajan
Lok Sabha
  • Loading...

More Telugu News