Salman Khan: సల్మాన్ ఖానా... సాధారణ మనిషా? అన్నది కోర్టు తీర్పు నిరూపించింది: పెటా

  • కోర్టు తీర్పును స్వాగతించిన జంతు హక్కుల సంఘాలు
  • వ్యక్తి ప్రజాదరణ తీర్పుపై ప్రభావం చూపదని మరోసారి వెల్లడైంది
  • న్యాయమే గెలించిందంటూ అభిప్రాయాలు

కృష్ణజింకల వేట కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు జోధ్ పూర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించడాన్ని జంతు ప్రేమికులు స్వాగతించారు. జంతు సంరక్షణ చట్టం కింద గరిష్ట శిక్ష విధించినందుకు కొందరు అభినందనలు వ్యక్తం చేశారు. దీనిపై జంతు హక్కుల పోరాట సంస్థ 'పెటా' స్పందించింది. ‘‘మీరు సల్మానా లేక సాధారణ మనిషా? అన్నది కోర్టు తీర్పు తెలియజేసింది. న్యాయమే గెలిచింది’’ అని పెటా అధికార ప్రతినిధి సచిన్ బంగరా పేర్కొన్నారు.

పెటాతో పాటు పీపుల్ ఫర్ యానిమల్స్, వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్, హ్యుమన్ సొసైటీ తదితర సంస్థలు కోర్టు తీర్పును ఆహ్వానించిన వాటిలో ఉన్నాయి. 1998 అక్టోబర్ 1న హమ్ సాత్ సాత్ హై చిత్రం షూటింగ్ సందర్భంగా సల్మాన్ ఖాన్ రెండు కృష్ణ జింకలను కాల్చి చంపినట్టు న్యాయస్థానం విశ్వసించింది. ‘‘న్యాయం గెలిచినందుకు సంతోషంగా ఉంది. నిందితుడు జైలు ఊచల వెనక్కి వెళ్లాడు. ఓ వ్యక్తి ప్రజాదరణ అన్నది కేసుపై ఎటువంటి ప్రభావం చూపించదని న్యాయ వ్యవస్థ మరోసారి నిరూపించింది’’ అని పీపుల్ ఫర్ యానిమల్స్ ట్రస్టీ గౌరిమౌలేఖి అన్నారు.

  • Loading...

More Telugu News