star india: స్టార్ ఇండియాతో పాటు దూరదర్శన్ లో కూడా ఐపీఎల్ మ్యాచ్ లు చూడొచ్చు!

  • ఐదేళ్ల ఐపీఎల్ ప్రసార హక్కులను 6,138 కోట్లకు కొనుగోలు చేసిన స్టార్ ఇండియా
  • ఐపీఎల్ మ్యాచ్ లను దూరదర్శన్ లో ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించిన కేంద్రం
  • ఐదు నిమిషాల ఆలస్యంగా దూరదర్శన్ లో ప్రసారం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ లు ఇకపై దూరదర్శన్ లో కూడా ప్రసారం కానున్నాయి. 2018 నుంచి 2023 వరకు ఐపీఎల్ ప్రసార హక్కులను 6,138 కోట్ల రూపాయలకు స్టార్ ఇండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ కు లభించే ఆదరణ దృష్ట్యా టెలికాం సంస్థలు వివిధ రీఛార్జ్ ఆఫర్లను ప్రవేశపెడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఐపీఎల్ ను దూరదర్శన్ స్పోర్ట్స్ ఛానెల్ లో ప్రసారం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఐపీఎల్ మ్యాచ్ లు ఇకపై దూరదర్శన్‌ లో కూడా ప్రసారం కానున్నాయి. అయితే స్టార్ ఇండియా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ సంస్థ లైవ్ ప్రసారం ఇవ్వనుండగా, ఐదు నిమిషాలు ఆలస్యంగా దూరదర్శన్ లో ఐపీఎల్ మ్యాచ్‌ లు ప్రసారం అవుతాయి.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News