avanthi srinivas: పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో ధర్నా చేస్తూ.. కళ్లు తిరిగి పడిపోయిన అవంతి శ్రీనివాస్.. ఆసుపత్రికి తరలింపు

  • రాజ్యసభలో దాదాపు 4 గంటల పాటు బైఠాయించిన టీడీపీ సభ్యులు
  • వారికి మద్దతుగా టీడీపీ లోక్‌సభ సభ్యుల ధర్నా
  • ఎంపీ అవంతి శ్రీనివాస్‌కు ఆరోగ్య పరీక్షలు 
  • బీపీ పడిపోయిందని గుర్తించిన వైద్యులు

రాజ్యసభలో దాదాపు 4 గంటల నుంచి టీడీపీ సభ్యులు తమ నిరసన తెలుపుతోన్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా టీడీపీ లోక్‌సభ సభ్యులు కూడా పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ధర్నా చేస్తున్నారు. అయితే, ఈ ఆందోళనలో పాల్గొన్న ఎంపీ అవంతి శ్రీనివాస్ ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయారు. ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు. బీపీ పడిపోవడం వల్ల కళ్లు తిరిగి పడిపోయారని చెప్పారు. వెంటనే ఆయనను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు, రాజ్యసభలో బైఠాయించిన టీడీపీ సభ్యులతో రాజ్యసభ సెక్రటరీ జనరల్ చర్చలు జరుపుతున్నారు. అంతకుముందు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌తో పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి విజయ్ గోయల్ కూడా చర్చలు జరిపి విఫలమైన విషయం తెలిసిందే.

avanthi srinivas
parliament
  • Error fetching data: Network response was not ok

More Telugu News