Salman Khan: తీర్పు వినగానే తన చెల్లెళ్లతో పాటు బోరున విలపించిన సల్మాన్‌ ఖాన్‌

  • కృష్ణజింకలను వేటాడి చంపిన కేసు
  • తీర్పు ఇచ్చిన స‌మ‌యంలో కోర్టులో ఆయ‌న చెల్లెళ్లు
  • అన్నకి యాంటీ డిప్రెసెంట్లు ఇచ్చిన అర్పిత‌, అల్విరా

కృష్ణజింకలను వేటాడి చంపిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమాన విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆ స‌మ‌యంలో కోర్టులో ఆయ‌న చెల్లెళ్లు అర్పిత‌, అల్విరా కూడా ఉన్నారు. కోర్టు తీర్పు ఇవ్వ‌గానే స‌ల్మాన్ ఖాన్ క‌న్నీరు పెట్టుకోగా, ఆయన పక్కనే ఉన్న ఇద్దరు చెల్లెళ్లు ఓదార్చారు. ఆ సమయంలో వారు కూడా బోరున విలపించారు. సల్మాన్ ఖాన్ కి యాంటీ డిప్రెసెంట్లు ఇచ్చారు.

కాగా, ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ జోధ్ పుర్ సెంట్ర‌ల్ జైలులో ఉన్నాడు. ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది వేసిన బెయిల్ పిటిష‌న్ పై కోర్టు రేపు తీర్పు వెల్ల‌డించ‌నుంది. కాగా, బిష్నోయ్‌ వర్గానికి చెందిన గ్రామస్తులు కృష్ణజింకను దైవంగా భావిస్తారు. స‌ల్మాన్ ఖాన్ ఆ ప‌ని చేయ‌గానే వారు సల్మాన్‌తో పాటు మిగతా నటీనటులపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయ‌గా ఈ కేసులో ఈ రోజు స‌ల్మాన్ కి శిక్ష ప‌డింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News