Twitter: ట్విట్టర్‌లో మహేశ్‌బాబు ఫాలోవర్ల సంఖ్య 6 మిలియన్లకు చేరిన వైనం

- సోషల్ మీడియాలో దూసుకెళుతోన్న మహేశ్ బాబు
- టాలీవుడ్ హీరోల్లో ఎవరికీ లేనంత మంది ఫాలోవర్లు
- తన సినిమాల వివరాలు తెలుపుతోన్న మహేశ్
సోషల్ మీడియాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు దూసుకెళుతున్నాడు. టాలీవుడ్ హీరోల్లో ఎవరికీ లేనంత మంది ఫాలోవర్లు మహేశ్ బాబుకి ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మహేశ్ ఫాలోవర్ల సంఖ్య మరింత పెరిగింది. ట్విట్టర్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 6 మిలియన్ల (60 లక్షలు) కు చేరింది. అంతమంది ఫాలోవర్లు ఉన్న మహేశ్ బాబు మాత్రం ట్విట్టర్‌లో ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్నారు. ఆయనే మహేశ్ బావ గల్లా జయదేవ్.
