simbu: బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన హీరో శింబు తండ్రి

  • కర్ణాటకలో అధికారం కోసం తమిళనాడుకు అన్యాయం చేస్తోంది
  • తమిళులంతా కలసి బీజేపీకి బుద్ధి చెప్పాలి
  • అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఏకం కావాలి

భారతీయ జనతా పార్టీపై ప్రముఖ తమిళ నటుడు శింబు తండ్రి, ఇలక్కియ డీఎంకే అధ్యక్షుడు టి.రాజేందర్ మండిపడ్డారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకునే క్రమంలో... తిమిళనాడుకు, తమిళ ప్రజలకు బీజేపీ అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కావేరీ మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయకుండా దారుణంగా వ్యవహరిస్తోందని అన్నారు.

తమిళనాడుకు కావేరీ జలాలను అందించకూడదని భావిస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పేలా తమిళ ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు వేర్వేరుగా ఆందోళనలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని... అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు ఏకమైతేనే ఫలితం దక్కుతుందని చెప్పారు. కావేరి కోసం ఎవరు ఆందోళన చేపట్టినా తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు.

simbu
t rajender
kaveri
BJP
protest
  • Loading...

More Telugu News