Malayalam: ప్రముఖ మలయాళ సినీ నటుడు కొల్లాం అజిత్ మృతి

  • 500కు పైగా చిత్రాల్లో నటించిన అజిత్
  • విలన్ పాత్రలకు పెట్టింది పేరు
  • కొల్లాంలో జరగనున్న అంత్యక్రియలు

దాదాపు 30 సంవత్సరాలుగా తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 500కు పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ సినీ నటుడు కొల్లాం అజిత్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 56 సంవత్సరాలు. మలయాళ చిత్ర పరిశ్రమలో విలన్ పేరు చెబితే తొలుత గుర్తొచ్చేది అజిత్ పేరే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించగా, పది రోజుల క్రితం ఆసుపత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్యం మరింతగా విషమించి కన్నుమూశారు.

1984లో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'పరాను పరాను పరాను' ద్వారా కెరీర్ ను ప్రారంభించిన ఆయన, ఆపై 1987లో వచ్చిన 'ఇరుపతమ్ మాత్తాండు' హిట్ తో నిలదొక్కుకున్నారు. కాగా, అజిత్ అంత్యక్రియలను కొల్లాంలో జరపనున్నట్టు ఆయన కుటుంబీకులు తెలిపారు. అజిత్ మృతిపై పలువురు మాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చారు.

Malayalam
Ajit
Died
Star Actor
  • Loading...

More Telugu News