bjp: యోగి ఆదిత్యనాథ్ పై మోదీకి ఫిర్యాదు చేసిన బీజేపీ దళిత ఎంపీ!

  • నా నియోజకవర్గంలో పాలనాపరమైన వివక్షను ఎదుర్కొంటున్నా
  • సమస్యలు చెప్పుకోవడానికి వస్తే అవమానించారన్న ఎంపీ
  • విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చిన మోదీ

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ పై ఆ రాష్ట్రానికి చెందిన దళిత ఎంపీ ఛోటేలాల్ ఖర్వార్ (45) ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు. తాను ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లినప్పుడు... తనను నానా తిట్లు తిట్టారని, బయటకు గెంటివేయించారని ప్రధానికి లేఖ రాశారు. తన నియోజకవర్గంలో పాలనాపరమైన వివక్షతను తాను ఎదుర్కొంటున్నానని... ఈ నేపథ్యంలో, సమస్యలను చెప్పుకోవడానికి తాను వస్తే... సొంత పార్టీనే తనను పట్టించుకోలేదని, అవమానించిందని లేఖలో పేర్కొన్నారు.

 లేఖలో యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే, సునీల్ బన్సాలీల పేర్లను ప్రస్తావించారు. ఇదే విషయమై జాతీయ షెడ్యూల్ కులాలు, తెగల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఛోటేలాల్ ఖర్వార్ ఫిర్యాదుపై మోదీ కూడా స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తానని, చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News