Sujana Chowdary: ఉపఎన్నికలు జరిగితే లోక్ సభకు పోటీ చేస్తా!: సుజనా చౌదరి

  • ప్రత్యేక హోదా కోసం ప్రజా క్షేత్రంలోకి
  • ఉప ఎన్నికలు జరిగితే రాజ్యసభకు రాజీనామా
  • తాను ప్రజల్లోకి వెళ్లి చిత్తశుద్ధిని నిరూపించుకుంటానన్న సుజనా చౌదరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సుజనా చౌదరి స్పష్టం చేశారు. ఈ ఉదయం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తామని చెప్పడం ఓ నాటకం మాత్రమేనని అన్నారు. హోదా కోసం నిజంగా పోరాడుతున్న పార్టీ తెలుగుదేశం మాత్రమేనని చెప్పారు. వైసీపీ వారు చేసిన రాజీనామాలను ఆమోదించరని, ఉప ఎన్నికల ద్వారా ప్రజా క్షేత్రంలోకి వెళతామని వారు చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని అన్నారు. ఉప ఎన్నికలు జరుగుతాయని చెప్పడం కలేనని, ఒకవేళ ఎన్నికలు జరిగి ప్రజల్లోకి వెళ్లడం నిజమైతే, తాను రాజ్యసభ పదవికి రాజీనామా చేసి లోక్ సభకు పోటీ చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటానని చెప్పారు.

Sujana Chowdary
Lok Sabha
Rajya Sabha
Resignation
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News