kevin peterson: హిందీలో కెవిన్ పీటర్సన్ ట్వీట్... భారతీయులు ఫిదా!

  • పూర్తి హిందీలో ట్వీట్ చేసిన కెవిన్ పీటర్సన్
  • కజిరంగా పార్కులో జంతుగణనపై ట్వీట్
  • ఫిదా అయిపోయిన భారతీయులు

ఆంగ్ల భాష వ్యామోహంలో పడి మాతృభాషను మర్చిపోతున్నామని పలువురు భాషా ప్రేమికులు పేర్కొంటుంటారు. అలాంటి వారందర్నీ ఆకట్టుకునేలా స్వచ్ఛమైన హిందీలో ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు కెవిన్ పీటర్సన్ చేసిన ట్వీట్ భారతీయుల గుండెల్ని హత్తుకుంది. కజిరంగా జాతీయ పార్కులో రైనోల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడం తనకు ఆనందం కలిగిస్తోందని, భారతీయులన్నా, భారత్‌ లోని జంతుజాలమన్నా తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నాడు. దీంతో ఫిదా అయిన క్రికెట్ ప్రేమికులు... భారతీయులు కూడా ఇంత స్వచ్ఛంగా హిందీలో రాయలేరని పేర్కొంటున్నారు. మనకంటే కెవినే బెటరని, ఒక్క ఆంగ్ల పదం కూడా లేకుండా ట్వీట్ చేశాడని మెచ్చుకుంటున్నారు. 

kevin peterson
hindi tweet
Twitter
Cricket
  • Error fetching data: Network response was not ok

More Telugu News