namrata sirodkar: 'ఇతనిని ప్రేమిస్తున్నా'నంటూ ఫొటో పోస్టు చేసిన నమ్రత... మేము కూడా ప్రేమిస్తున్నామంటున్న అభిమానులు!

  • మహేశ్ బాబు ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసిన నమ్రత
  • 'ఐ లవ్ దిస్ మేన్' అంటూ క్యాప్షన్
  • మేము కూడా అంటూ అభిమానుల కామెంట్లు

 తన భర్త మహేశ్‌ బాబుపై ఉన్న ప్రేమను సినీ నటి నమ్రతా శిరోద్కర్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. 'భరత్ అనే నేను' సినిమా షూటింగ్ లో మహేష్ బాబు బిజీగా ఉండగా... అతని ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసిన నమ్రత 'ఐ లవ్ దిస్ మేన్' అని పేర్కొంది. దీంతో అభిమానులు ఆనందంతో రెచ్చిపోయారు.

‘మేము కూడా ప్రేమిస్తున్నాం, మహేశ్‌ సూపర్‌ గా ఉన్నారు, మీరు అదృష్టవంతులు' అంటూ కామెంట్లు, లైకులు, షేర్లతో హోరెత్తించారు. కాగా, ‘వంశీ’ సినిమా షూటింగ్ లో మహేశ్‌-నమ్రత ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. అనంతరం దంపతులుగా మారిన వీరిద్దరికీ గౌతమ్, సితార జన్మించారు. సోషల్ మీడియాలో మహేశ్‌ సినిమా ప్రచార చిత్రాలు, పిల్లల ఫొటోలను నమ్రత షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.

namrata sirodkar
maheshbabu
Instagram
Social Media
  • Loading...

More Telugu News