Parliament: పార్లమెంట్ సమావేశాలు వృథా కావడంతో... ఎన్డీయే కీలక నిర్ణయం!

  • 23 రోజుల వేతనం, ఇతర భత్యాలను వదులుకుంటున్న వైనం 
  • 'నో వర్క్ నో పే' విధానం మేరకు నిర్ణయం 
  • నేడు పార్లమెంట్ నిరవధిక వాయిదాకు అవకాశం!

మలివిడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏ విధమైన చర్చ లేకుండా సాగిన నేపథ్యంలో ఎన్డీయే ప్రజా ప్రతినిధులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ 23 రోజుల వేతనం, ఇతర భత్యాలను తీసుకోరాదని నిర్ణయించినట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ వెల్లడించారు. ఈ సమావేశాలు ఎటువంటి చర్చలు లేకుండా వృథాగా పోవడం బాధాకరమని అన్నారు.

 కాగా, ప్రజా ప్రతినిధులు తమ వేతనాన్ని వదులుకోవాలని నిర్ణయించుకోవడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. ప్రజా ప్రతినిధులకు 'నో వర్క్ నో పే' విధానాన్ని అమలు చేయాలని నరేంద్ర మోదీ సూచించిన నేపథ్యంలో, వేతనాలను వదులుకునే విషయమై మంత్రులు, కూటమిలోని ముఖ్య నేతలతో చర్చించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు అనంత్ కుమార్ తెలిపారు. ఎంపీలు వదులుకున్న వేతనాన్ని సంక్షేమ నిధిలో కలిపి పేదలకు చేరుస్తామని ఆయన వెల్లడించారు.

ఇదిలావుండగా, పార్లమెంట్ రేపటి వరకూ సాగాల్సి వున్నప్పటికీ, నేడే నిరవధిక వాయిదాకు అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాల వల్లే పార్లమెంట్ లో చర్చలు సాగడం లేదని బీజేపీ ఆరోపిస్తుండగా, అన్నాడీఎంకే వంటి కొన్ని పార్టీలతో కావాలనే బీజేపీ నిరసనలు చేయిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News