Samantaha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • సమంత తొలిసారిగా డబ్బింగ్ చెబుతోంది 
  • ఎన్టీఆర్ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్లు 
  • పాట పాడతానంటున్న హీరోగారి అమ్మాయి 
  • డబ్బింగ్ మొదలెట్టిన 'ఆటగాళ్లు'!

 *  అందాలతార సమంత తొలిసారిగా తన పాత్రకు తానే తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంటోంది. సావిత్రి బయోపిక్ గా రూపొందుతున్న 'మహానటి' చిత్రంలో తన పాత్రకు సమంత డబ్బింగ్ చెబుతోంది. ఇన్నాళ్లూ ఈ ముద్దుగుమ్మకు గాయని చిన్మయి డబ్బింగ్ చెప్పిన సంగతి విదితమే.
*  ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తొలిసారిగా రూపొందుతున్న చిత్రంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్లు ఇద్దరు నటిస్తున్నారు. మీనా, లయ కలసి ఇందులో హీరో హీరోయిన్లకు తల్లులుగా నటిస్తున్నట్టు సమాచారం. అయితే, ఎవరు ఎవరికి తల్లిగా నటిస్తున్నారన్నది ఇంకా వెల్లడి కాలేదు.      
*  తాజాగా '2 స్టేట్స్' చిత్రం రీమేక్ ద్వారా కథానాయికగా మారిన ప్రముఖ నటుడు డా. రాజశేఖర్ కూతురు శివాని మంచి గాయని కూడా. ప్రస్తుతం క్లాసికల్ మ్యూజిక్ లో శిక్షణ కూడా తీసుకుంటోంది. ఎప్పటికైనా సినిమాల్లో పాటలు పాడాలన్నది ఆమె కోరికట. కాగా, త్వరలోనే ఈ చిన్నది '2 స్టేట్స్' చిత్రం షూటింగులో జాయిన్ అవుతుంది.      
*  నారా రోహిత్, జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషించిన 'ఆటగాళ్లు' చిత్రం డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈ వేసవిలోనే విడుదల చేస్తారు.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News