ashok gajapathi raj: టీడీపీ నేత అశోక్ గజపతిరాజుకు మాతృ వియోగం

  • ముంబైలో అశోక్ గజపతిరాజు తల్లి కుసుమ (95) మృతి
  • రేపు ఉదయం ఢిల్లీ నుంచి ముంబై వెళ్లనున్న అశోక్ గజపతిరాజు
  • రేపు సాయంత్రం ఆమె అంత్యక్రియలు

కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు తల్లి కుసుమ గజపతిరాజు (95) మృతి చెందారు. ముంబైలోని తన బంగ్లాలో ఆమె మృతి చెందారు. తల్లి మరణవార్త తెలుసుకున్న అశోక్ గజపతిరాజు ఢిల్లీ నుంచి ముంబైకు బయలుదేరి వెళ్లనున్నట్టు సమాచారం. రేపు సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలుస్తోంది. కుసుమ మృతిపై టీడీపీ నేతలు పలువురు సంతాపం తెలిపారు. కాగా, 1955లో గజపతినగరం శాసనసభ్యురాలిగా ఆమె పని చేశారు.

ashok gajapathi raj
mother demise
  • Loading...

More Telugu News