Salman Khan: సల్మాన్ ఖాన్ కోసం ఇంట్లో నుంచి పారిపోయి ముంబై వెళ్లిన బాలిక!

  • మధ్యప్రదేశ్ లోని బెరాసియా నుంచి ముంబైకు పారిపోయిన బాలిక
  • గెలాక్సీ అపార్ట్ మెంట్స్ వద్ద బాలికను అడ్డగించిన సెక్యూరిటీ
  • పోలీసులకు సమాచారం..బాలల సంరక్షణ గృహానికి తరలింపు

బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ పై ఉన్న వీరాభిమానం ఓ బాలికను ఇంట్లో నుంచి పారిపోయేలా చేసింది. సల్మాన్ ఖాన్ ని ఎలా అయినా సరే కలవాలనే కోరికతో మధ్యప్రదేశ్ లోని బెరాసియా పట్టణానికి చెందిన పదిహేనేళ్ల బాలిక ఇంట్లో నుంచి పారిపోయి రైలెక్కి ముంబైకు వెళ్లింది. బాంద్రా టెర్మినల్ లో దిగిన ఆ బాలిక అక్కడి నుంచి నేరుగా సల్మాన్ నివసించే గెలాక్సీ అపార్ట్ మెంట్ కు చేరుకుని, లోపలికి వెళ్లేందుకు యత్నించింది.

అయితే, అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. సల్మాన్ ని ఎలాగైనా కలవాలనే దృఢ నిశ్చయంతో వచ్చిన ఆ బాలిక, అక్కడి గోడ పైకి ఎక్కాలని చూసింది. ఈ సమాచారాన్ని పోలీసులకు సెక్యూరిటీ సిబ్బంది అందించారు. దీంతో పోలీసులు వచ్చి, ఆమెను బాలల సంరక్షణ గృహానికి తరలించారు. బాలిక ఆధార్ కార్డు వివరాలను పరిశీలించి ఆమె తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని పోలీసులు అందజేశారు.

గత ఆదివారం నాడు ఆ బాలిక ఇంట్లో నుంచి పారిపోయి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. కాగా, సల్మాన్ తన భర్త అంటూ గెలాక్సీ అపార్ట్ మెంట్స్ వద్ద ఇటీవల ఓ మహిళ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. సెక్యూరిటి సిబ్బంది కళ్లు గప్పి అపార్ట్ మెంట్ పైభాగానికి చేరుకుని నానా హంగామా సృష్టించింది.

  • Loading...

More Telugu News