Police: రాచకొండ పోలీస్ కమీషనర్‌గా రెండో తరగతి బాలుడు.. కల నిజం చేసిన మహేశ్ భగవత్

  • కేన్సర్‌తో బాధపడుతోన్న ఆరేళ్ల బాలుడు డి షాన్
  • పోలీస్ కావాలని కోరిక
  • గుర్తించిన మేక్ ఏ విష్  ఫౌండేషన్ ప్రతినిధులు

కేన్సర్‌తో బాధపడుతోన్న ఆరేళ్ల బాలుడి కలను రాచకొండ పోలీసులు నెరవేర్చారు. డి షాన్ అనే ఆ బాలుడికి పోలీస్ కమీషనర్ కావాలనే కోరిక ఉండేది. ఈ విషయాన్ని గుర్తించిన మేక్ ఏ విష్ ఫౌండేషన్ ప్రతినిధులు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ ని సంప్రదించగా పోలీసులు ఆ బాలుడిని తమ వద్దకు పిలిచి పోలీస్ డ్రెస్ వేసి ఆ హోదాలో కూర్చోబెట్టారు.
   ఆ బాలుడు పలు ఆదేశాలు ఇస్తున్నట్లు, పలు పైళ్లపై సంతకాలు పెడుతున్నట్టు ఫొటోలు తీశారు. రాచకొండ పోలీస్ కమిషనర్‌ హోదాలో కూర్చున్న ఆ బాలుడు హర్షం వ్యక్తం చేశాడు. మెదక్ జిల్లాకు చెందిన డి షాన్‌ ఓ ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఈ విషయాన్ని రాచకొండ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఆ బాలుడి కల నిజం చేసిన రాచకొండ పోలీసులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.     

  • Error fetching data: Network response was not ok

More Telugu News