afridi: అఫ్రిది తీవ్ర వ్యాఖ్యలపై స్పందించిన విరాట్ కోహ్లీ
- కశ్మీర్లో పరిస్థితి దారుణంగా ఉందని అఫ్రిది వ్యాఖ్యలు
- జాతి ప్రయోజనాలను వ్యతిరేకిస్తే మద్దతివ్వనన్న కోహ్లీ
- పూర్తి అవగాహన లేకుండా తాను మాట్లాడనని వ్యాఖ్య
- తనకు దేశ ప్రయోజనాలే ముందుంటాయని సమాధానం
కశ్మీర్లో పరిస్థితి దారుణంగా ఉందని, అణచివేత పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం పోరాడుతోన్న అమాయక ప్రజలు అన్యాయంగా తుపాకీ తూటాలకు బలైపోతున్నారని, భారత్‌పై ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై టీమిండియా క్రికెటర్ గౌతం గంభీర్ ఇటీవలే స్పందించి దీటుగా సమాధానం ఇవ్వగా, తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అఫ్రిది తీవ్ర వ్యాఖ్యలపై స్పందించాడు. తన జాతి ప్రయోజనాలను వ్యతిరేకించే ఎవరి అభిప్రాయాలకూ తన మద్దతు ఉండదని, కొన్ని అంశాలపై స్పందించాలా? వద్దా? అన్నది ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయమని అన్నారు. ఓ అంశంపై పూర్తి అవగాహన లేకుండా తాను మాట్లాడనని, తన వరకు దేశ ప్రయోజనాలే ముందుంటాయని అన్నాడు.