sensex: యూఎస్, చైనాల దెబ్బకు కుదేలైన మార్కెట్లు!

  • అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం
  • ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం
  • 352 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

అమెరికా, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు బెంబేలెత్తుతున్నాయి. దీని ప్రభావం భారత మార్కెట్లపై కూడా తీవ్రంగానే పడింది. ఈ ఉదయం 90 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్ ట్రేడింగ్ ను ప్రారంభించింది. అయితే మరో 106 అమెరికా వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్టు చెనా ప్రకటించడంతో సూచీలు కుప్పకూలాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 352 పాయింట్లు పతనమై 33,019కి పడిపోయింది. నిఫ్టీ 117 పాయింట్లు కోల్పోయి 10,128కి చేరింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ పవర్ (11.43%), క్వాలిటీ (9.95%), రిలయన్స్ నావల్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (5.04%), రెప్కో హోమ్ ఫైనాన్స్ (4.42%), టాటా మోటార్స్ (3.60%).  
 
టాప్ లూజర్స్:
అదానీ ఎంటర్ ప్రైజెస్ (-6.46%), నెట్ వర్క్ 18 (-5.11%), హిందుస్థాన్ కన్ స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (-5.11%), వక్రాంగీ (-4.98%), జై ప్రకాశ్ అసోసియేట్స్ (-4.67%).    

  • Loading...

More Telugu News