Sania Mirza: ఓ నెటిజన్ ట్వీట్ కు సానియా మీర్జా ప్రతి స్పందన అదిరింది!

  • 2000 ఏప్రిల్ 6న కొత్త కుర్రాడు షాహీన్ షా జన్మించాడు
  • 1999 అక్టోబర్ 14న అంతర్జాతీయ క్రికెట్ లోకి షోయబ్ అడుగుపెట్టాడన్న నెటిజన్
  • ‘నా భర్త ఇంకా కుర్రాడే’ అంటూ సానియా స్పందన

ఓ నెటిజన్ ట్వీట్ కు ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా స్పందించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. కొత్త క్రికెటర్ అఫ్రిదీ కన్నా సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ కి కొంచెం వయసు ఎక్కువంటూ ఆ నెటిజన్ ఈ ట్వీట్ చేశాడు. ‘పాకిస్థాన్ X1 జట్టు తరపున షోయబ్ మాలిక్, కొత్త కుర్రాడు షాహీన్ షా అఫ్రిది క్రీడాకారులిద్దరూ ఆడుతున్నారని, 2000 ఏప్రిల్ 6న షాహీన్ జన్మించాడని, అంతర్జాతీయ క్రికెట్ లోకి 1999 అక్టోబర్ 14న షోయబ్ మాలిక్ అడుగుపెట్టాడు’ అని ఆ నెటిజన్ తన పోస్ట్ లో పేర్కొన్నాడు.

దీనికి సానియా స్పందిస్తూ, ‘కామన్.. నా భర్త ఇంకా కుర్రాడే..’ అని చెప్పింది. కాగా, సానియా ప్రతి స్పందనకు నెటిజన్లు బాగానే స్పందిస్తున్నారు. పాక్ జట్టులో ఉన్న ఎంతో మంది ఆటగాళ్ల కంటే మాలిక్ భాయ్ చాలా యంగ్ అని, ఈ దంపతులిద్దరినీ ఎంతో ప్రేమిస్తామని, వాళ్లు ఆరోగ్యంగా ఉండాలని, తన ఫిట్ నెస్ కాపాడుకుంటూ ఇంకా టీమ్ లో కొనసాగుతున్నాడని నెటిజన్లు స్పందించడం గమనార్హం.

Sania Mirza
shoyab malik
  • Error fetching data: Network response was not ok

More Telugu News