Chandrababu: ‘చంద్రబాబునాయుడు మీద మీరేమన్నా పగబట్టారా?’ అని ఒకాయన నన్ను అడిగాడు!: తమ్మారెడ్డి భరద్వాజ

  • చంద్రబాబును విమర్శించవద్దన్నాడు
  • మనోళ్లను మనం ఇలా చేయకూడదన్నాడు
  • ఎవరైనా తప్పు చేస్తే తప్పే అంటామని చెప్పాను

‘చంద్రబాబు మీద మీరేమన్నా పగబట్టారా?' అని ఈ మధ్య కాలంలో తన వద్దకు వచ్చిన ఒక మధ్య తరగతి వ్యక్తి ప్రశ్నించారని ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ‘నా ఆలోచన’లో ఆయన మాట్లాడారు. ‘ఆవిధంగా ప్రశ్నించిన వ్యక్తితో నేను ఏమన్నానంటే ‘చంద్రబాబునాయుడు గారి మీద నేను పగబట్టడమేంటయ్యా? ఆయన ముఖ్యమంత్రి.. ఆయనతో పోలిస్తే నేనెంత, అల్పుడిని!’ అన్నాను.  చంద్రబాబును విమర్శిస్తున్నట్టుగా నా పోస్ట్ లన్నీ ఉంటాయని ఆయన నాతో అన్నాడు.

‘వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ కూడా పోస్ట్ లు చేశాను. మరి, జగన్మోహన్ రెడ్డి గారు మీకు శత్రువా? అని ఎందుకు అడగలేదు? మోదీ గారిని తిడుతూ పోస్ట్ లు చేసినప్పుడు ఇదే ప్రశ్న మీరెందుకడగలేదు? ఎవరు తప్పు చేశారనిపిస్తే వారిని ప్రశ్నిస్తాను’ అని ఆయనకు సమాధానమిచ్చా.

చివరకు ఆయన చెప్పిందేమిటంటే, ఇటువంటివి చెప్పకూడదు..నాకు నవ్వొస్తోంది కానీ, చెప్పాల్సి వస్తోంది. ‘మనోడు సార్’ అని అన్నాడు.‘మనోడు’ అంటే ఏంటన్నా..‘మన కమ్మోళ్లు సార్..మనోళ్లను మనం ఇలా చేయకూడదు సార్’ అని జవాబిచ్చాడు. ‘మనోళ్లను మనం చేయడమేంటయ్యా, తప్పు చేస్తే తప్పంటాము. ‘మనోళ్లు’ అని మీరంటున్నారు కదా! ఇదే మనోళ్లు నా కోసం ఎప్పుడైనా వచ్చారా?’ అని అడిగానని’ భరద్వాజ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News