kamal rasheed khan: ఒకటి, రెండు ఏళ్ల కంటే ఎక్కువ బతకను: బాలీవుడ్ నటుడు కమల్ రషీద్ ఖాన్

  • ఉదర క్యాన్సర్ తో బాధపడుతున్నా
  • వ్యాధి తీవ్రత స్టేజ్-3లో ఉంది
  • రెండు కోరికలు తీరలేదు.. వాటి గురించే బాధ

ప్రముఖ బాలీవుడ్ నటుడు, రచయిత, నిర్మాత, క్రిటిక్ కమల్ రషీద్ ఖాన్ సంచలన విషయాన్ని వెల్లడించాడు. తాను ఉదర క్యాన్సర్ (స్టమక్ క్యాన్సర్)తో బాధ పడుతున్నానని నిన్న రాత్రి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం వ్యాధి తీవ్రత స్టేజ్-3లో ఉందని చెప్పాడు. ఒకటి, రెండేళ్ల కంటే తాను ఎక్కువ కాలం బతికే అవకాశం లేదని తెలిపాడు. తనపై ఎవరూ జాలి చూపించవద్దని, తనను ఓదార్చేందుకు వచ్చే ఫోన్ కాల్స్ ను స్వీకరించలేనని చెప్పాడు.

తనను ఇంతకు ముందులా తిట్టేవారికి, ద్వేషించేవారికి అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపాడు. తనను ద్వేషించినా తాను ప్రేమిస్తూనే ఉంటానని అన్నాడు.  ఇప్పటి వరకు తనకు రెండు కోరికలు తీరలేదని.. వాటి గురించే తనకు బాధగా ఉందని చెప్పాడు. నిర్మాతగా ఒక ఏ గ్రేడ్ సినిమా తీయాలనేది ఒక కోరిక అని... అమితాబ్ తో సినిమా తీయాలని, ఆయనతో కలసి పనిచేయాలనేది రెండో కోరిక అని... ఆ రెండు కోరికలు తనతోనే చనిపోతాయని అన్నాడు. ఇకపై ప్రతిక్షణం తన కుటుంబంతోనే గడుపుతానని తెలిపాడు. 

kamal rasheed khan
cancer
Bollywood
  • Loading...

More Telugu News