nara rohith: నారా రోహిత్ .. జగ్గూ భాయ్ తలపడే సీన్స్ చూసి తీరాల్సిందేనట!

  • 'ఆటగాళ్లు'గా నారా రోహిత్ .. జగపతిబాబు 
  • డబ్బింగ్ పనులు ఈ రోజునే మొదలు 
  • వేసవిలో భారీస్థాయిలో విడుదల        

నారా రోహిత్ కథానాయకుడిగా .. జగపతిబాబు ప్రతినాయకుడిగా 'ఆటగాళ్లు' సినిమా రూపొందింది. పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నారా రోహిత్ .. జగపతిబాబు ఇద్దరూ కూడా నువ్వా .. నేనా? అన్నట్టుగా పోటీపడి నటించారట. 'ఆటగాళ్లు' టైటిల్ కి తగినట్టుగానే ఈ సినిమాలో ఈ ఇద్దరి పాత్రలను ఎంతో ఆసక్తికరంగా మలిచారట.

ఈ ఇద్దరూ తలపడే ఉత్కంఠభరితమైన సన్నివేశాలను చూసితీరవలసిందే అని అంటున్నారు. ఈ ఇద్దరి నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పనులను ఈ రోజున మొదలెట్టేశారు. నారా రోహిత్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నాడు. దర్శన కథానాయికగా నటించిన ఈ సినిమాను, వేసవిలో విడుదల చేయనున్నారు.    

  • Error fetching data: Network response was not ok

More Telugu News