Chandrababu: నిన్న రాత్రి చంద్రబాబు కొన్ని రహస్య సమావేశాలు జరిపారు: విజయసాయిరెడ్డి

  • రోడ్ల మీద యూటర్న్ బోర్డులకు బదులు చంద్రబాబు ఫొటోలు పెట్టాలి
  • ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఢిల్లీకి రాలేదు
  • రహస్య సమావేశాల వివరాలను చంద్రబాబు బయటపెట్టాలి

ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోడ్ల మీద ఉండే యూ టర్న్ లను చూస్తే, తనకు చంద్రబాబే గుర్తుకు వస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. యూటర్న్ బోర్డులకు బదులు చంద్రబాబు ఫొటోలు పెడితే బాగుంటుందని అన్నారు. ఢిల్లీలో చంద్రబాబును కలిసేందుకు ఏ పార్టీ నేతలు కూడా ఇష్టపడటం లేదని... చంద్రబాబును కలవండి అంటూ టీడీపీ ఎంపీలు ఇతర పార్టీల నేతలను అడుక్కుంటున్నారని చెప్పారు.

దావోస్ కు వెళ్లినప్పుడు ఇడ్లీ, దోశ అంటూ ప్రమోట్ చేసుకున్నారని అన్నారు. చంద్రబాబు తీరు చూస్తుంటే బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడిలా ఉందని చెప్పారు. ప్రత్యేక హోదాను సాధించేందుకు చంద్రబాబు ఢిల్లీకి రాలేదని, కేవలం వ్యవస్థలను తనకు అనుకూలంగా మలచుకునేందుకే వచ్చారని అన్నారు. నిన్న రాత్రి చంద్రబాబు కొన్ని రహస్య సమావేశాలు జరిపారని... ఎవరెవరిని కలిశారు? ఎందుకు కలిశారు? ఎలాంటి లావాదేవీలు జరిపారు? అనే విషయాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ జరగకుండా టీడీపీ ఎంపీలు అడ్డుకుంటున్నారని విమర్శించారు. 

Chandrababu
Vijay Sai Reddy
special status
  • Loading...

More Telugu News