Balakrishna: అందరం అక్క‌డ‌ కలుద్దాం: నందమూరి బాలకృష్ణ పిలుపు

  • సిడ్నీ తెలుగు అసోసియేషన్ 25వ వార్షికోత్స‌వం
  • హాజరు కానున్న బాలయ్య
  • సిడ్నీ తెలుగు అసోసియేషన్‌పై ప్రశంసలు
  • తెలుగువాడి కీర్తిని ఆస్ట్రేలియాకు రుచి చూపించిందని వ్యాఖ్య

సిడ్నీ తెలుగు అసోసియేషన్ 25వ వార్షికోత్స‌వం జరుపుకుంటున్న శుభవేళ వారి ఆహ్వానం మేరకు ఈ నెల‌ 7న  అక్క‌డ‌కు వెళుతున్నాన‌ని, అందరం అక్క‌డ‌ కలుద్దామ‌ని.. తెలుగువాడి కీర్తిని అంబరానికి చాటుదామ‌ని టీడీపీ ఎమ్మెల్యే, సినీ న‌టుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. దేశం దాటి, స‌రిహ‌ద్దులు దాటి, తెలుగువాడి కీర్తిని ఆస్ట్రేలియాకు రుచి చూపించిన సిడ్నీ తెలుగు అసోసియేషన్ ఉగాది సంబ‌రాల పేరిట‌ ర‌జ‌తోత్స‌వం జ‌రుపుకుంటోంద‌ని బాల‌య్య వివ‌రించారు. కాగా, ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీహ‌రితో పాటు ప‌లువురు తెలుగు యాంక‌ర్లు కూడా హాజ‌రుకానున్నారు.    

  • Loading...

More Telugu News