Nimmakayala Chinarajappa: ముద్రగడ వెనుకనున్నవారే పవన్ వెనుక ఉన్నారు!: చినరాజప్ప, కళా వెంకట్రావు

  • మాణిక్యాలరావు వ్యాఖ్యలతో పవన్ వెనుక బీజేపీ ఉందని అర్థమైంది
  • పవన్ స్థిరత్వం లేని మనిషని తేలిపోయింది
  • ఎంత మంది కలిసినా టీడీపీకి ఢోకా లేదు

ముద్రగడ పద్మనాభం వెనక ఉన్నవాళ్లే పవన్‌ కల్యాణ్ వెనుక ఉన్నారని మంత్రులు కళా వెంకట్రావు, చినరాజప్ప అన్నారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడుతూ, కాపుల కోసం వారు అప్పుడప్పుడు పోరాడితే తాము నిత్యం పోరాటం చేస్తున్నామని అన్నారు. మాజీ మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యలతో పవన్ కల్యాణ్ వెనుక బీజేపీ ఉందని అర్థమైపోయిందని అన్నారు.

ఎవరైనా తమ పార్టీ గొప్పదని చెప్పుకుంటారని, కానీ మాణిక్యాలరావు పక్క పార్టీ బలంగా ఉందని చెబుతున్నారని వారు ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ స్థిరత్వం లేని మనిషని తేలిపోయిందని వారు పేర్కొన్నారు. ఎంతమంది కలిసినా తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ఎలాంటి సమస్య రాదని వారు అభిప్రాయపడ్డారు.

Nimmakayala Chinarajappa
kalavenkatrao
Telugudesam
  • Loading...

More Telugu News