Cricket: టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పిన ఆండర్సన్

  • క్రైస్ట్ చర్చ్ టెస్టుతో అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పిన జేమ్స్ ఆండర్సన్
  • టెస్టుల్లో ప్రపంచంలోనే అత్యధిక బంతులు విసిరిన తొలి పేసర్ గా ఆవిర్భావం
  • కోర్ట్నీ వాల్ష్ రికార్డును అధిగమించిన వైనం 

టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యధిక బంతులు విసిరిన తొలి ఫాస్ట్‌ బౌలర్‌ గా ఇంగ్లాండ్‌ పేస్‌ బౌలర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ అరుదైన ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. వెస్టిండీస్ బౌలింగ్ దిగ్గజం కోర్ట్నీవాల్ష్ (30,019 బంతులు) ను ఆండర్సన్‌ (30,074 బంతులు) అధిగమించాడు. 136 టెస్టులు ఆడిన ఆండర్సన్ 531 వికెట్లు తీశాడు. ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌ లోనూ 887పాయింట్లతో రెండో అత్యుత్తమ టెస్టు బౌలర్ గా కొనసాగుతున్నాడు.

 టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యధిక బంతులు విసిరిన బౌలర్ల జాబితాలో శ్రీలంక ఆఫ్‌ స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ (133 టెస్టుల్లో 44,039 బంతులు) అగ్ర స్థానంలో ఉండగా, భారత్ స్పిన్ దిగ్గజం అనిల్‌ కుంబ్లే (132 టెస్టుల్లో 40,850 బంతులు) రెండో స్థానంలో ఉన్నాడు, ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్‌ వార్న్‌ (145టెస్టుల్లో 40,705 బంతులు) మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తరువాతి స్థానంలో ఆండర్సన్ నిలిచాడు.

  • Loading...

More Telugu News