Chandrababu: అవును, మోదీని సీఎం పదవి నుంచి తప్పించాలని అప్పట్లో డిమాండ్ చేశా: జాతీయ మీడియాతో చంద్రబాబు

  • అప్పటి మాటలను మోదీ గుర్తుంచుకొని ఉండచ్చేమో
  • మోదీ ఇలా చేస్తారని అనుకోలేదు
  • కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడమే నాకు ముఖ్యం

ఢిల్లీలో ఉన్న చంద్రబాబు జాతీయ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో పలు విషయాలను వెల్లడించారు. గుజరాత్ అల్లర్ల తర్వాత మోదీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని అందరికన్నా ముందు మీరే కదా డిమాండ్ చేశారు? అనే ప్రశ్నకు బదులుగా... అవునని చెప్పారు. జరిగిన విషయాలను చరిత్ర రికార్డుల నుంచి ఎవరూ చెరిపివేయలేరని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే మోదీతో చేతులు కలిపానని... కానీ, ఆయన ఇలా చేస్తారని తాను అనుకోలేదని చెప్పారు. అప్పట్లో మీరు అన్న మాటలను మోదీ గుర్తుంచుకున్నారేమో? అనే ప్రశ్నకు బదులుగా... గుర్తుంచుకొని ఉండవచ్చేమో అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. తనకు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు.

ఏపీకి కేంద్రం సాయం చేస్తే, అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలను అధిగమిస్తుందనే భావనతో మోదీ మీకు సహాయం చేయడం లేదా? అనే ప్రశ్నకు బదులుగా... ఆ విషయాన్ని మీరే గ్రహించాలని చంద్రబాబు అన్నారు. ఏపీ పట్ల గవర్నర్ నరసింహన్ సానుకూలంగా స్పందించడం లేదా? అనే ప్రశ్నకు బదులుగా 'ఔను' అన్నట్టు తల ఊపారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు వివరించేందుకే తాను ఢిల్లీకి వచ్చానని చెప్పారు. ప్రస్తుతం తనకు రాజకీయాలు ముఖ్యం కాదని... ఏపీకి న్యాయం చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడమే ముఖ్యమని అన్నారు.

  • Loading...

More Telugu News