royal challengers banglore: కోహ్లీ, మెక్ కల్లమ్, చాహల్ డాన్స్... వీడియో చూడండి

  • ప్రాక్టీస్ లో బిజీగా ఉన్న ఆటగాళ్లు
  • ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి
  • బెంగళూరు ఫ్రాంఛైజీ కోసం స్టెప్పులేసిన కోహ్లీ, మెక్ కల్లమ్, చాహల్

ఐపీఎల్‌ మెగా టోర్నీ ప్రారంభానికి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆటగాళ్లంతా ప్రాక్టీస్‌ తో బిజీగా గడుపుతున్నారు. మరోవైపు ఆయా జట్ల ఫ్రాంఛైజీల ప్రమోషన్ ఫొటో షూట్లలో పాల్గొంటూ ఆకట్టుకుంటున్నారు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తమ ఆటగాళ్లతో ఒక ప్రోమో సిద్ధం చేస్తోంది. దీనికోసం కెప్టెన్ కోహ్లీ, బ్రెండన్‌ మెక్ కల్లమ్‌, చాహల్ తో స్టెప్పులేయించింది.

బ్యాటు, బంతితో చెలరేగే ఆటగాళ్లను మ్యూజిక్‌ కు అనుగుణంగా స్టెప్పులేయించడంతో సమన్వయం కుదరలేదు. దీంతో నవ్వు ఆపుకోలేక చాహల్ పెద్దగా నవ్వేశాడు. అతనితో కోహ్లీ కూడా శ్రుతి కలిపాడు. దీనికి సంబంధించిన వీడియోను చాహల్‌ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దీనికి ‘ఐపీఎల్‌ కోసం దిగ్గజ ఆటగాళ్లు కోహ్లీ, మెక్ కల్లమ్‌ తో వార్మప్‌ చేస్తున్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News