kedarnath: కేదార్ నాథ్ వద్ద ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ఎలా కుప్పకూలిందో.. వీడియో చూడండి

  • నిన్న కుప్పకూలిన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్
  • ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
  • ఇనుపబద్ద తగిలి కూలిపోయిన హెలికాప్టర్

ఉత్తరాఖండ్ లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ వద్ద నిన్న ఘోర ప్రమాదం సంభవించింది. భారత వైమానిక దళానికి చెందిన ఓ హెలికాప్టర్ తలకిందులుగా కుప్పకూలింది. హెలీపాడ్ సమీపంలోని ఓ ఇనుప బద్దీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సైనిక పరికరాలతో పాటు కొంతమందిని తీసుకొస్తున్న ఎమ్ఐ-17 కార్గో హెలికాస్టర్ ఈ ఉదయం కేదార్ నాథ్ ఆలయానికి సమీపంలో ఉన్న హెలీపాడ్ వద్ద దిగేందుకు యత్నించింది. అయితే, అక్కడే ఉన్న ఓ ఇనుప బద్దీ హెలికాప్టర్ కు బలంగా తగిలింది. దీంతో, అది కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరక్కపోవడంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News