railway department: ఏపీలో నాలుగు రైల్వే స్టేషన్లకు అంతర్జాతీయ హోదా

  • ఏపీలో నాలుగు రైల్వే స్టేషన్లకు అంతర్జాతీయ హోదా కల్పించిన రైల్వే శాఖ
  • విజయవాడ, గుంటూరు, కర్నూలు, గుంతకల్లు స్టేషన్ల ఆధునికీకరణ
  • ఒక్కో స్టేషన్ కు 25 కోట్లు విడుదల చేసిన రైల్వే శాఖ

ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రైల్వేస్టేషన్లకు అంతర్జాతీయ హోదాను రైల్వే శాఖ కట్టబెట్టనుంది. దీంతో ఏపీలోని ఆ నాలుగు రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఆధునికీకరించనున్నారు. విజయవాడ, గుంటూరు, కర్నూలు, గుంతకల్లు రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ హోదాకు ఎంపిక చేసినట్టు రైల్వే శాఖ తెలిపింది. ఒక్కో రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు 25 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ రైల్వే మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రైల్వే శాఖ ఆధునికీకరణకు సంబంధించిన ప్రతిపాదనలు ఈనెల 10వ తేదీ లోపు పంపాలని రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. 

railway department
international railway stations
Andhra Pradesh
  • Loading...

More Telugu News