Nara Lokesh: లోకేశ్ బాబు మంచి పొలిటీషియన్ : మంత్రి అచ్చెన్నాయుడు కితాబు

  • లోకేశ్ పై వైసీపీ ఆరోపణలు, విమర్శలను ఖండిస్తున్నా
  • తన తండ్రి లాగే ప్రతిదీ తెలుసుకుని లోకేశ్ వ్యవహరిస్తారు
  • మంచి పేరు తెచ్చుకోవాలని చాలా బాగా పనిచేస్తున్నారు

ఏపీ నేత నారా లోకేశ్ పై వైసీపీ చేస్తున్న అవినీతి ఆరోపణలను, విమర్శలను మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్టుగా  వైసీపీ తీరు ఉంది. వైసీపీ పార్టీ పుట్టుకే అవినీతి పుట్టుక. యువకుడు లోకేశ్ ను చూసి ఈరోజున గర్వపడుతున్నాం..హర్షిస్తున్నాం. లోకేశ్ బాబు తన తండ్రి లాగే ప్రతిదీ తెలుసుకుని వ్యవహరిస్తారు. మంచి పొలిటీషియన్. 

ప్రతిరోజూ ఒక నూతన విద్యార్థిగా లోకేశ్ ఉంటారు. మంచి పేరు తెచ్చుకోవాలని చాలా బాగా పనిచేస్తున్నారు. అటువంటి వ్యక్తిపై వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడటం తగదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గానీ, ఆయన కుమారుడు గానీ, ఆయన పార్టీలో ఉన్నటువంటి దొంగలు గానీ చేసినటువంటి నేరాలు ఘోరాలను తెలుగుజాతి ఉన్నంత వరకు ఎవరూ మర్చిపోరు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రాజకీయాలు చెల్లవని చెబుతున్నా’ అని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.

Nara Lokesh
atchanaidu
  • Loading...

More Telugu News