Pakistan: భారత సైన్యం దారుణంగా వ్యవహరిస్తోందంటూ పాకిస్థాన్ ప్రధాని లేఖ
- కశ్మీర్ విషయంలో మరోసారి పాక్ అభ్యంతరకర వ్యాఖ్యలు
- కశ్మీరీలను మనశ్శాంతిగా ఉండనివ్వటం లేదన్న అబ్బాసీ
- అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటోందని వ్యాఖ్య
- కశ్మీర్‌లో స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారని లేఖ
కశ్మీరు ప్రజల విషయంలో భారత సైన్యం దారుణంగా వ్యవహరిస్తోందంటూ పాకిస్థాన్ ప్రధానమంత్రి షాహిద్ ఖక్కన్ అబ్బాసీ స్వయంగా ఆరోపణలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రాంత ప్రజలను భారత్ మనశ్శాంతిగా ఉండనివ్వటం లేదని, అక్కడి అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటోందని ఆయన చెప్పుకొచ్చారు.
కశ్మీర్‌లో స్వేచ్ఛ కోసం పోరాడుతూ ధర్నాలు, ఆందోళన చేపట్టే వారిని అణచివేస్తోందని ఆయన అన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని, నిజనిర్ధారణ కమిటీ ద్వారా కశ్మీర్‌లోని పరిస్థితులపై అధ్యయనం చేయాలని పాక్ ప్రధాని ఐక్యరాజ్యసమితిని కోరుతున్నట్లు పేర్కొన్నారు.