somu veerraju: సోము వీర్రాజుకు కలిసొచ్చిన అదృష్టం!

  • అధ్యక్ష పదవి ఆఫర్ ను తిరస్కరించిన మాణిక్యాలరావు
  • కన్నా లక్ష్మీనారాయణపై వ్యక్తమైన అభ్యంతరాలు
  • చివరకు సోము వీర్రాజు పేరు ఖరారు

ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు అదృష్టం కలిసొచ్చింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇంతకు ముందు మాజీ మంత్రి మాణిక్యాలరావును అధ్యక్షుడిగా చేయాలని బీజేపీ హైకమాండ్ భావించింది.

అయితే, హైకమాండ్ ఆఫర్ ను ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీపై అనునిత్యం విరుచుకుపడే సోము వీర్రాజు పట్ల అధిష్ఠానం మొగ్గు చూపింది. మరో నేత కన్నా లక్ష్మీనారాయణ పేరును కూడా పరిశీలించినప్పటికీ... ఆయన పట్ల కొన్ని అభ్యంతరాలు రావడంతో, చివరకు ఆయనను పక్కన పెట్టినట్టు సమాచారం. 

somu veerraju
manikyala rao
kanna lakshminarayana
ap
BJP
president
  • Loading...

More Telugu News